Home  »  TV News  »  రామ్ చరణ్ మనసు చాల గొప్పది

Updated : Feb 21, 2026

 

బిబి జోడి ఈ వీక్ సూపర్ స్టార్స్ స్పెషల్ గా ఈ వారం శనివారం ఎపిసోడ్ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో డెమోన్ పవన్ - రీతూ కలిసి రామ్ చరణ్ సాంగ్స్ కి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రాంచరణ్ గురించి శేఖర్ మాష్టర్ ని అడిగాడు. "మీరు ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది" అనేసరికి. "రామ్ చరణ్ గారితో నేను ఫస్ట్ చేసింది డింపుల్ పింపుల్, మెగా మీటర్. మెగా మీటర్ కి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. చాల మంచి మనిషి. ఇప్పటికీ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్లినా ఎప్పుడు పలకరించినా ఒక క్లోజ్ ఫీలింగ్ వస్తుంది. మొన్న కూడా సెలంబుల సాంగ్ చేసినప్పుడు అది మదరాసి మూవీలో సర్ మెసేజ్ పెట్టారు. సాంగ్ చాల బాగుంది మూవ్మెంట్స్ ఫ్రెష్ గా ఉన్నాయి అన్నారు. హీరో అయ్యుండి కూడా సాంగ్ కోసం నాకు మెసేజ్ పెట్టి చెప్పడం కూడా చాలా గ్రేట్. అది అందరికీ రాదు. ఇంకోటేంటంటే ఆచార్య మూవీ జరుగుతున్నప్పుడు సర్ వచ్చి మాష్టర్ మీ రీల్స్ చూస్తూ ఉంటాను.

 చాల బాగున్నాయి మీ ఫామిలీ పిల్లలతో. పాప, బాబు బాగున్నారా అని ఆయన అడిగారు. ఒక రోజు తీసుకురండి చూడాలనుండి అంటే నేను తీసుకెళ్ళాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది." అంటూ శేఖర్ మాష్టర్ చెప్పారు. "నేను ఆయన్ని చాల సార్లు కలిసాను. నాకు ఆయన్ని కలిసినప్పుడాల్లా ఒక బ్రదర్ అన్న ఫీలింగ్ వస్తుంది. మా సినిమా ప్రమోషన్ కోసం అడిగినప్పుడు ఇంటికి పిలిచి మాతో పాటు కూర్చుని సరదాగా మాతో స్కిట్ చేసి టికెట్ లాంచ్ చేసారు అదొక వన్దర్ ఫుల్ మూమెంట్ నాకు..ఎప్పుడు కాల్ చేసిన ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇలా ఇన్స్టెంట్ గా రియాక్షన్ వస్తుంది.లవ్ యు చరణ్ గారు " అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. "నటుడిగా కంటే ఒక మనిషిగా ఆయన చాల గొప్ప వ్యక్తి. ఆయన ఆడవాళ్లను చాలా బాగా గౌరవిస్తారు. అందరినీ ఈక్వల్ గా చూసుకుంటారు. ఆయనలో ఈ విషయం నాకు బాగా నచ్చుతుంది" అంటూ జడ్జ్ శ్రీదేవి చెప్పుకొచ్చింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.